News February 25, 2025
గుంటూరులో లారీ ఢీకొని ఇద్దరు మృతి

గోరంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో లారీ ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అమరావతి నుంచి గుంటూరు నగరంలోకి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందియ. స్థానికుల సమాచారంతో నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నారు.
Similar News
News July 4, 2025
దివ్యాంగులకు ఉపకరణాల దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జి టీడబ్ల్యూఓ శిరీష తెలిపారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2025-26 ఆర్థిక సం.రానికి శారీరక వైకల్యం ఉన్నవారికి, అంధులకు మానసిక దివ్యాంగుల సహాయార్థం రెట్రోఫీటెడ్ మోటర్ వెహికల్స్, బ్యాటరీ వీల్ చైర్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.
News July 4, 2025
భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
News July 4, 2025
నిర్మల్: ‘విద్యార్థుల వివరాలను త్వరగా నమోదు చేయండి’

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో వివిధ స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్వరగా నమోదు చేయాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం తెలిపారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా నుంచి 54 మంది ఎంపికయ్యారన్నారు. వీరందరి వివరాలను ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.