News February 25, 2025

పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం

image

జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి లోపలకి చొరబడి ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురుగా చేశాయి. నెల రోజుల్లో 2 సార్లు ఇదే మిల్‌పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

Similar News

News September 17, 2025

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి సురేఖ

image

వరంగల్ ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ అతిధిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

RGM: పోలీస్ కమిషనరేట్ లో ప్రజా పాలన దినోత్సవం

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో బుధవారం ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతం, రాష్ట్ర గీతం ఆలపించారు. గోదావరిఖని ACPలు మడత రమేష్, శ్రీనివాస్, ప్రతాప్, శ్రీనివాస్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

పెద్దపల్లి: ‘విశ్వకర్మ జయంతికి సెలవు ప్రకటించాలి’

image

PDPL కలెక్టరేట్‌లో యజ్ఞమహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు. అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి సంఘ నేతలు కృతజ్ఞతలు తెలుపారు. విశ్వకర్మ జయంతికి సెలవు ప్రకటించాలన్నారు