News February 25, 2025

ఏనుగుల దాడి ఘటనపై స్పందించిన పవన్

image

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి ఘటనపై<<>> డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్‌ను అసెంబ్లీ నుంచి హుటాహుటిన వై.కోట వెళ్లాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

Similar News

News February 25, 2025

మిస్ వరల్డ్: IND తరఫున పోటీలో ఈమెనే

image

దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన TGలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7-31 మధ్య జరగనున్నాయి. ఈసారి భారత్ తరఫున రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా పోటీలో ఉండనున్నారు. ఈ 21 ఏళ్ల సుందరి 2023 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచారు. బ్యూటీ, స్మార్ట్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆమెను విన్నర్‌గా నిలిపాయి. అదే సంకల్పంతో మిస్ వరల్డ్‌గా నిలుస్తారేమో చూడాలి.

News February 25, 2025

ఈ అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి: వైద్యులు

image

షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పిండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌తో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్‌ తినొద్దు’ అని చెప్పారు.

News February 25, 2025

రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.

error: Content is protected !!