News February 25, 2025
కామారెడ్డి: మార్చి 8న లోక్ అదాలత్

మార్చ్ 8న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి బ్యాంకు అధికారులతో న్యాయమూర్తి సమావేశమై, మాట్లాడారు. వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో బ్యాంకు కేసులను పరిష్కరించడానికి సహకరించాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
Similar News
News February 25, 2025
Stock Markets: ఉదయం లాభాలు.. సాయంత్రం నష్టాలు

స్టాక్‌మార్కెట్లు నేడు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,547 (-5), సెన్సెక్స్ 74,602 (147) వద్ద స్థిరపడ్డాయి. ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎగిశాయి. ఐటీ, మెటల్, ఫార్మా, PSU బ్యాంకు, రియాల్టి, O&G షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఎయిర్‌టెల్, ఎం&ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టైటాన్ టాప్ గెయినర్స్. డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ట్రెంట్, హీరోమోటో, సన్‌ఫార్మా టాప్ లూజర్స్.
News February 25, 2025
35సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ చేసిందేంటి?: కేటీఆర్

TG: 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు విసుగు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? ఇవాళ మళ్లీ హస్తిన వెళ్లి చేసేదేంటని ప్రశ్నించారు. ‘గత 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. SLBCలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.
News February 25, 2025
నోడల్ ఆఫీసర్లదే కీలక పాత్ర: కలెక్టర్

ఈ నెల 27న జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్రే కీలకమని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లో నోడల్ ఆఫీసర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.