News February 25, 2025
పార్వతీపురం: 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల్లో 48 గంటల పాటు అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేయాలన్నారు. వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు రోజున కూడా వీటిని మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News November 9, 2025
మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్‌లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.
News November 9, 2025
KMR: బటన్ ప్రెస్ చేయండి.. సాయం పొందండి!

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారి 161పై పసుపు పచ్చని రంగులో అక్కడక్కడ ఈ ఎమర్జెన్సీ ఫోన్ బాక్స్‌లు కనిపిస్తూ ఉంటాయి. దీని ఉపయోగాలు ఏంటంటే..? ఈ దారి గుండా ప్రయాణించే వాహనాల్లో ఇంధనం అయిపోవడం వాహనం మొరాయించడం తదితర ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ ఫోన్ బాక్స్‌కు ఉండే తెల్లని బటన్‌ను ప్రెస్ చేసి, మన సమస్యను తెలపాలి. వెంటనే హైవే సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపడతారు. ఈ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.
News November 8, 2025
సీఎం పర్యటనలో లోపాలు లేకుండా పనిచేయాలి: కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయలని సూచించారు.


