News February 25, 2025

వేములవాడ: రెండు బైక్‌లు ఢీ.. గాయాలు

image

వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ముందు రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన సాయి, లక్షణ్‌, చందుర్తి మండలం సనుగులకు చెందిన భూపతి, గంగాధర్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు వేములవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 25, 2025

ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ముఖ్రా(కె) మాజీ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామ‌ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసి ఆమెను అభినందించారు.

News February 25, 2025

6 నెలల్లో 4000 కి.మీ రోడ్లు వేశాం: పవన్

image

AP: NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1800 కి.మీ సీసీ రోడ్లు మాత్రమే వేసిందని విమర్శించారు. తమ పాలనలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించామని, ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు.

News February 25, 2025

ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామ‌ని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసి ఆమెను అభినందించారు.

error: Content is protected !!