News February 25, 2025
కామారెడ్డి: గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నోడల్ అధికారి G.నాగేశ్వరరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 97.34% శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్షల్లో 7481 మంది విద్యార్థులకు గానూ 7282 మంది వచ్చారని పేర్కొన్నారు.
Similar News
News February 25, 2025
తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.
News February 25, 2025
GOVT స్కూల్‌లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్

మహబూబాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం సందర్శించారు. క్లాస్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డైట్ మెనూ ప్రకారం పక్కాగా ఉండాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని తెలిపారు. అనంతరం క్లాస్ రూమ్‌లో పిల్లలతో మాట్లాడారు. వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 25, 2025
మహబూబాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని అన్ని శాఖల కార్యాలయాలను కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని, ఉద్యోగులు క్రమం తప్పకుండా సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఉద్యోగుల హాజరు పట్టిక, రిజిస్టర్లను పరిశీలించారు.