News February 25, 2025
మార్చి 1న కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు Xలో తెలిపారు. ఒకే రోజు లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. పదేళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు.
Similar News
News February 25, 2025
SLBC ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ: మంత్రి ఉత్తమ్

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై త్వరలో పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు. అనుకోకుండా జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా టన్నెల్ 14kms వద్ద ప్రమాదం జరగగా, రెస్క్యూ బృందాలు 13.7kms వరకు చేరుకున్నాయి. సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
News February 25, 2025
బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.
News February 25, 2025
అహంకారంతో సిబ్బందిపై చేయి.. మంత్రి రాజీనామా

సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించినందుకు న్యూజిలాండ్‌లో ఓ మంత్రి పదవి ఊడింది. ఆండ్రూ బేలీ ఇతరులతో చర్చిస్తున్న సమయంలో సిబ్బంది భుజంపై చేయి వేశాడు. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో తాను కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించానని ఆండ్రూ అంగీకరించారు. ఆయన గతంలో కూడా తాగి ఓ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శలు ఎదుర్కొన్నారు.