News February 25, 2025

HYDలో పెరిగిన హలీం ధరలు

image

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.

Similar News

News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులు జోడించి ప్రయత్నించాం: Dy.CM

image

ఏపీ ప్రజలకు ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులు అనే భావన వస్తుందని Dy.CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. 2021 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం చేసిన ప్రకటనకు YCP మద్ధతు పలికిందని అన్నారు. అప్పట్లో నాదేండ్లతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ నిర్ణయంపై పునరాలోచించాలని చేతులు జోడించి ప్రయత్నించామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్లాట్లు వేసి అమ్ముకోడానికి YCP నాయకులు చూశారని ఆరోపించారు.

error: Content is protected !!