News February 25, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6900

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.10 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,890 ధర పలకగా.. నేడు రూ.6900 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Similar News

News February 25, 2025

వనపర్తికి సీఎం రాబోతున్నారు..!

image

వనపర్తికి మార్చి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరోజు రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం ఇచ్చారన్నారు. ఎంపీ మల్లు రవి, ఒబెదుల్లా కోత్వాల్ తోపాటు కాంగ్రెస్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర రావు తదితరులు సీఎంను కలిశారన్నారు.

News February 25, 2025

బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

image

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.

News February 25, 2025

అహంకారంతో సిబ్బందిపై చేయి.. మంత్రి రాజీనామా

image

సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించినందుకు న్యూజిలాండ్‌లో ఓ మంత్రి పదవి ఊడింది. ఆండ్రూ బేలీ ఇతరులతో చర్చిస్తున్న సమయంలో సిబ్బంది భుజంపై చేయి వేశాడు. ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో తాను కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించానని ఆండ్రూ అంగీకరించారు. ఆయన గతంలో కూడా తాగి ఓ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శలు ఎదుర్కొన్నారు.

error: Content is protected !!