News February 25, 2025

రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 4, 2025

భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

image

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News July 4, 2025

నిర్మల్: ‘విద్యార్థుల వివరాలను త్వరగా నమోదు చేయండి’

image

నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో వివిధ స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు త్వరగా నమోదు చేయాలని నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం తెలిపారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా నుంచి 54 మంది ఎంపికయ్యారన్నారు. వీరందరి వివరాలను ఎన్‌ఎస్‌పీ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.

News July 4, 2025

రామాపురం వద్ద ఎదురెదురు ఢీకొన్న కార్లు

image

రాయచోటి నియోజకవర్గం రామాపురం NH 44 నల్లగుట్టపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కొండవాండ్లపల్లికి చెందిన నర్సిపల్లి నాగేందర్‌రెడ్డి కారును ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేందర్‌రెడ్డి కారులో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.