News February 25, 2025
వనపర్తి జిల్లా ఉష్ణోగ్రత వివరాలు

గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా పెబ్బేర్‌లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాన్గల్ 36.2, కేతేపల్లి 36.1, ఆత్మకూర్ 36.1, శ్రీరంగాపూర్ 36.0, కానాయిపల్లి 36.0, అమరచింత 35.9, వెలుగొండ 35.9, విలియంకొండ 35.8, మదనపూర్ 35.7, జానంపేట 35.7, వీపనగండ్ల 35.7, దగడ 35.6, రేమద్దుల 35.4, ఘన్పూర్ 35.3, వనపర్తి 35.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.
Similar News
News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
News February 25, 2025
NLG: రిజిస్టర్డ్ ఓటర్లకు సెలవు

ఈనెల 27 న జరగనున్న WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకుగాను ఈ నెల 27న ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ & ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజిస్టర్డ్ ఓటర్లకు ఇది వర్తిస్తుందని తెలిపారు.
News February 25, 2025
మహబూబాబాద్: ఈనెల 27న ఉపాధ్యాయులకు సెలవు

ఈనెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.