News March 21, 2024
‘PU సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు పెంచాలి’

ఈనెల 12న పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజులను ఈనెల 27 వరకు చెల్లించాలని తెలిపింది. కాగా 1, 3, 5వ సెమిస్టర్ల ఇంప్రూవ్మెంట్, రీవాల్యుయేషన్ ఫలితాలు రాకముందే 2, 4, 6వ సెమిస్టర్ల ఫీజు గడువు రావడంతో ఆయా సెమిస్టర్ల డిగ్రీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2, 4 ,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువును పెంచాలని పీయూ యూనివర్సిటీ పరీక్షల అధికారులను కోరుతున్నారు.
Similar News
News August 31, 2025
MBNR: నీటిగుంతలో పడి వ్యక్తి మృతి

వినాయక నిమజ్జనానికి వెళ్లి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలం బోడ జానంపేటలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం కావేరమ్మపేట గ్రామానికి చెందిన ఆంజనేయులు BSCPL క్రషర్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కంపెనీలో ఉన్న గణేశుని నిమజ్జనం చేశారు. ప్రమాదవశాత్తు ఆంజనేయులు గుంతలో పడ్డాడు. శుక్రవారం నుంచి గాలించగా శనివారం సాయంత్రం
అతని మృతదేహన్ని బయటికి తీశారు.
News August 31, 2025
MBNR: పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం సీసీ కుంట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. సిబ్బంది సేవలపై ఏమైనా సమస్యలుంటే పరిశీలిస్తామని, విధుల విభజన (ఫంక్షనల్ వర్టికల్స్) ప్రకారం సమర్థవంతంగా పనిచేయాలని, ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
News August 30, 2025
MBNR: అడ్డకల్ PS.. SP ప్రత్యేక ఫోకస్

అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటదని ప్రతినిత్యం హైవే పై ట్రాఫిక్ నియంత్రణను జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, హైవేపై రోడ్డు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.