News February 25, 2025

బషీరాబాద్: తల్లి, కొడుకు ఆత్మహత్య

image

బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన తల్లి ఎల్లమ్మ (58), కొడుకు మొగులప్ప 36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.   

Similar News

News February 25, 2025

జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ను కలెక్టర్ అభినందించారు.

News February 25, 2025

జనగామ: యువత మత్తుకు బానిస కావొద్దు: కలెక్టర్

image

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో కలిసి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యా, వ్యవసాయ, ఎక్సైజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిస కావొద్దని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.

News February 25, 2025

ఇలాంటి వ్యక్తిని తొలిసారి చూస్తున్నా: సీఎం చంద్రబాబు

image

AP: ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని తొలి సారి చూస్తున్నా. నిన్న 11 మంది వైసీపీ సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారు. వారికి సభను గౌరవించే సంస్కారం లేదు. అసెంబ్లీలో నిన్న చీకటి రోజు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని స్పష్టం చేశారు.

error: Content is protected !!