News February 25, 2025

మెదక్: దంచి కొడుతున్న ఎండ

image

మెదక్ జిల్లాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనింపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధరణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 25, 2025

మెదక్: ఏడుపాయల జాతరకు భారీగా బస్సులు

image

ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని మెదక్ డీఎం సరేఖ పేర్కొన్నారు.

News February 25, 2025

రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.

error: Content is protected !!