News February 25, 2025

WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Similar News

News February 26, 2026

మేడారం జాతరలో 40 శాతం పెరిగిన కాలుష్యం!

image

మేడారం జాతరలో ధూళి కణాలు సాధారణ స్థాయి కంటే 40% ఎక్కువగా నమోదయ్యాయి. వరంగల్ జిల్లా పొల్యూషన్ బోర్డ్ అధికారులు జాతర తేదీల్లో నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశోధించారు. PM10 ధూళి కణాలు సాధారణంగా 100% ఉండాలి. జాతర సందర్భంలో 120 నుంచి 140 శాతం వరకు నమోదైనట్లు పొల్యూషన్ బోర్డ్ జిల్లా అధికారి సునీత తెలిపారు. చిన్న పరిమాణం కారణంగా అవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

News February 26, 2026

అక్షర ఆంధ్ర లక్ష్యంగా ‘ఉల్లాస్-02’ అమలుకు కలెక్టర్ ఆదేశం

image

విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. 100 శాతం అక్షరాస్యత సాధనకు కేంద్రం తెచ్చిన ‘ఉల్లాస్-02: అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

News February 26, 2026

GHMC: నిధుల విభజన వేళ రూ.300 కోట్ల దోపిడీ?

image

GHMC నిధుల విభజన కసరత్తు వేళ వ్యవస్థీకృత దోపిడీపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ డోర్ నంబరింగ్ పేరిట ప్రజల వ్యక్తిగత డేటా ప్రైవేట్ సర్వర్లకు మళ్లుతోంది. ఖైరతాబాద్, శేరిలింగంపల్లిలో బాగున్న రోడ్లనే కూల్చి వేస్తూ ‘సిండికేట్ కాంట్రాక్టర్లు’ ఏటా రూ.300 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. హరితహారం ‘గోస్ట్ ఆడిట్’ వెనుక బినామీల బాగోతంపై విజిలెన్స్ నివేదికలు సిద్ధమవుతున్నాయి.