News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News January 8, 2026
12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె!

AP: ఆర్టీసీలో ఈ నెల 12 నుంచి సమ్మెకు అద్దె బస్సుల యజమానులు సిద్ధమవుతున్నారు. ఇవాళ అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతోందని వారు చెబుతున్నారు. దీంతో అదనంగా రూ.5,200 ఇవ్వడానికి నిన్న RTC ఆదేశాలిచ్చింది. అయితే రూ.15-20వేల వరకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. కాగా రాష్ట్రంలో దాదాపు 2,500 అద్దె బస్సులున్నాయి. ఇవి ఆగిపోతే సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు.
News January 8, 2026
సంగారెడ్డి: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు. ఈ పరీక్షలు మూడు విడతల్లో జరగనున్నట్లు, ప్రతి బ్యాచ్ 25 మంది విద్యార్థుల చొప్పున ఐదు రోజుల పాటు నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాలు ఉన్న కళాశాలలో మాత్రమే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
News January 8, 2026
అంతర్వేది: పండుగప్ప.. ధరలోనూ ‘భారీ’ప్ప!

మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే ‘పండుగప్ప’ చేప అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో భారీ ధర పలికింది. సుమారు 16 కిలోల బరువున్న ఈ అరుదైన చేప వేలంపాటలో రూ.10,600లకు అమ్ముడైంది. సంక్రాంతి సీజన్ కావడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఉందని, పండుగ రోజుల్లో విక్రయిస్తే మరిన్ని నిధులు వస్తాయని వ్యాపారులు ఈ చేపను భద్రపరిచారు.


