News February 25, 2025
నిజామాబాద్: భార్య తిట్టిందని భర్త ఫిర్యాదు

వేరే వ్యక్తి ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడిగినందుకు భార్య తిట్టిందని భర్త ఆదిభట్ల PSలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్రకారం.. ఇంద్రసేనారెడ్డి భార్యతో రాగన్నగూడలో ఉంటున్నాడు. భార్య NZB జిల్లా భోదన్‌లోని ఓ గ్రామంలో జీపీ కార్యదర్శిగా పనిచేస్తుంది. 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఈ క్రమంలో 23న భార్యకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. కాసేపటికి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి పరార్ అవ్వడంతో ప్రశ్నించగా, ఆమె తిట్టిందని తెలిపారు.
Similar News
News December 25, 2025
కమ్మర్‌పల్లి: కారు ఢీ.. ఒకరి మృతి

కమ్మర్‌పల్లి మండలం రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాల గంగాధర్(70) రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది గంగాధర్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
News December 25, 2025
నిజామాబాద్: తెలంగాణ గోరక్ష సభ్యునిగా ధాత్రిక రమేష్

నిజామాబాదు జిల్లా కేంద్రానికి చెందిన ధాత్రిక రమేష్ తెలంగాణ ప్రాంత గోరక్ష విభాగం సభ్యులుగా నియమించినట్లు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోరక్ష అవగాహన కార్యక్రమాలతో పాటు గోఅధారిత వ్యవసాయం తదితర అంశాలపై యువత రైతుల్లో కార్యశాల నిర్వహించి చైతన్య పర్చడానికి కృషి చేస్తామన్నారు.
News December 25, 2025
నిజామాబాద్: ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడు: పీసీసీ చీఫ్

ఏసుక్రీస్తు యావత్ ప్రపంచానికి దేవుడని, ఆయన చూపిన ప్రేమ, కరుణా మార్గం మానవాళికి గొప్ప సందేశమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలిలో నిర్వహించిన క్రిస్‌మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి తన మతాన్ని ప్రార్థించే సంపూర్ణ స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్నారు. అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.


