News February 25, 2025

రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న రవాణా శాఖ మంత్రి

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటారు.

Similar News

News November 3, 2025

యాదాద్రి: కార్తీక దీపోత్సవంలో కలెక్టర్ దంపతులు

image

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సాయంత్రం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News November 3, 2025

వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 మంది మద్యం తాగి వాహనాలు నడపగా, మరో నలుగురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారని ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు, మద్యం సేవించి వాహనం నడపడం చట్టారీత్యా నేరమని హెచ్చరించారు.

News November 3, 2025

దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: భూపాలపల్లి కలెక్టర్

image

జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి 44 ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.