News February 25, 2025
పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి శోభ

పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలో కొమరాడ మండలంలో గుంప సోమేశ్వర ఆలయం, సాలూరు సమీపంలో పారమ్మకొండ, పార్వతీపురం సమీపంలో గల అడ్డాపుశీల, మక్కువ సమీపంలో గలగల ఉమా శాంతేశ్వర ఆలయం, ములక్కాయవలస ఆలయాలతో పాటు పలు ఆలయాలు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఉన్న శివాలయాలను కామెంట్ చేయండి.
Similar News
News February 25, 2025
భూపాలపల్లి: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సన్మానం

భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవిని ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కమలాక్షి మంగళవారం శాలువాతో సన్మానించారు. ఆల్కాలాంబ మాట్లాడుతూ.. దేశంలోనే లక్షకుపైగా మహిళా సభ్యత్వాలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్‌లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.
News February 25, 2025
EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా

TG: ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు నుంచి డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌ను <