News February 25, 2025
ఫేక్ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్త: ఎస్పీ

ఫేక్ ఉద్యోగ ప్రకటనలు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్‌లు, ఈమెయిల్‌లపై క్లిక్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎక్కువగా షేర్ చేయవద్దన్నారు.
Similar News
News September 14, 2025
టాస్ గెలిచిన భారత్

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు AUSతో భారత మహిళల జట్టు తొలి వన్డే ఆడనుంది. IND టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: ప్రతీకా రావల్, మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్(C), రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి, స్నేహ్ రాణా, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్
AUS: అలీసా హీలీ(w/c), లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, మూనీ, అన్నాబెల్, ఆష్లీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా, కింగ్, కిమ్ గార్త్, మేగాన్
News September 14, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి, HNK, HYD, BPL, JGL, JNM, KMM, ASF, మేడ్చల్, MHBD, MNCL, MUL, NLG, NRML, PDPL, రంగారెడ్డి, సంగారెడ్డి NZM, WGL జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని తిరుపతి, ప.గో తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
News September 14, 2025
రేవంత్ సర్కార్‌ను జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి: మంత్రి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా HYDలో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్ పరిధిలో ఆత్మీయ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో సీఎం పనిచేస్తున్నారన్నారు. ఆయనను, ప్రజా ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు.