News February 25, 2025
ఉద్యోగాల కల్పనపై శాసనమండలిలో గందరగోళం

AP: బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని YCP MLC వరుదు కళ్యాణి విమర్శించారు. దీంతో అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. 4లక్షల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పినట్లు ఆమె మాట్లాడగా.. మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. 4లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అని చెప్పామని, కల్పించామని చెప్పలేదన్నారు. YCP సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయకుండా కూర్చుంటే చర్చిద్దాం అని తెలిపారు.
Similar News
News February 25, 2025
ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్‌ను ఆహ్వానించింది.
News February 25, 2025
నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: CM

AP: 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామన్నారు.
News February 25, 2025
సిగరెట్ తాగితే ఎముకలు బలంగా ఉండవు!

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవ్వరూ దానిని పట్టించుకోరు. అయితే, సిగరెట్ వల్ల శరీరంలోని ఎముకలు కూడా దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. వాటి పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం మీ ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని తెలిపారు.