News February 25, 2025

స్కామ్: లాలూ కొడుకు, కుమార్తెకు షాక్

image

ల్యాండ్ ఫర్ జాబ్ స్కాములో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు రావాలని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో లాలూ సహా 78 మందిపై CBI దాఖలు చేసిన తుది ఛార్జిషీటును కోర్టు పరిశీలించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జోన్లలో భూమికి బదులు ఉద్యోగాలిస్తామని అవినీతికి పాల్పడ్డారని CBI ఆరోపిస్తోంది.

Similar News

News February 25, 2025

నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: CM

image

AP: 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు MOU పూర్తి చేశామని, వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామన్నారు.

News February 25, 2025

సిగరెట్ తాగితే ఎముకలు బలంగా ఉండవు!

image

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవ్వరూ దానిని పట్టించుకోరు. అయితే, సిగరెట్ వల్ల శరీరంలోని ఎముకలు కూడా దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. వాటి పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం మీ ఎముకలు దృఢంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని తెలిపారు.

News February 25, 2025

శివరాత్రికి స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా?

image

మహా శివరాత్రి పర్వదినమైన బుధవారం రోజు భారత స్టాక్‌మార్కెట్లు పనిచేయవు. FEB 26న ట్రేడింగ్ యాక్టివిటీస్ కొనసాగవని, సెటిల్మెంట్లు ఉండవని NSE, BSE ప్రకటించాయి. కమోడిటీ మార్కెట్‌కు మార్నింగ్ సెషన్ సెలవు ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ట్రేడింగ్ మొదలవుతుంది. 2025లో స్టాక్ మార్కెట్లకు మొత్తం 18 రోజులు సెలవులు ఉన్నాయి. శివరాత్రి తర్వాత మార్చి 14న హోలి, 31న రంజాన్‌ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.

error: Content is protected !!