News March 21, 2024

‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై సీఈవోను ఈసీ నివేదిక కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని సభలో బ్లాంకు పాసులు ఇవ్వడం, పవర్ కట్‌పై టీడీపీ, జనసేన ఈసీకి ఫిర్యాదు చేశాయి.

Similar News

News November 25, 2024

ఉమ్రాన్ మాలిక్ అన్‌సోల్డ్

image

SRH స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మరో పేసర్ జయదేవ్ ఉనద్క‌త్‌ను SRH రూ.కోటి చెల్లించి సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను గుజరాత్ రూ.75లక్షలకు, నువాన్ తుషారాను బెంగళూరు రూ.1.6 కోట్లకు కొన్నాయి. ఇక ఉమేశ్ యాదవ్, నవీన్ ఉల్ హక్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్ అయ్యారు.

News November 25, 2024

సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించిన ఇజ్రాయెల్‌!

image

లెబ‌నాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ‌కు ఇజ్రాయెల్‌ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో 2 రోజుల్లో దీనిపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఈ ఒప్పందం మేర‌కు హెజ్బొల్లా త‌న బ‌ల‌గాల‌ను లిటాని న‌దికి ఉత్త‌రంగా త‌రలించాలి. ద‌క్షిణ లెబ‌నాన్ నుంచి ఇజ్రాయెల్ ద‌ళాలను ఉప‌సంహ‌రించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జ‌రుగుతాయి. ఈ ఒప్పందం అమ‌లును అమెరికా ప‌ర్య‌వేక్షిస్తుంది.

News November 25, 2024

ఢిల్లీకి ‘మహా’ రాజకీయం

image

మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఈ రాత్రికి క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ కూడా వెళ్లనున్నారు. వీరు ముగ్గురు బీజేపీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అందులో సీఎం క్యాండిడేట్‌ను నిర్ణయించనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.