News February 25, 2025

ప్రత్యేక‌ హోదా అంశంపై మండలిలో రభస

image

AP: రాష్ట్రానికి ప్రత్యేక‌హోదా అంశంపై మండలిలో రభస జరిగింది. ‘హోదా ఎందుకు తేవట్లేదు?’ అని YCP సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది.? ఏడాదిలో రూ.13వేల కోట్లు తెచ్చాం. YCP 5ఏళ్లలో ఏం సాధించింది’ అని లోకేశ్ ప్రశ్నించారు.

Similar News

News February 25, 2025

ఆస్ట్రేలియాvsసౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్స్ టేబుల్‌లో SA తొలి స్థానంలో, AUS రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ AFGపై AUS, ENGపై SA గెలిస్తే ENG, AFG ఎలిమినేట్ అవుతాయి. AUS, SA సెమీస్ చేరతాయి.

News February 25, 2025

Gold Rates: రికార్డు బ్రేక్ దిశగా పరుగులు..

image

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరేందుకు తహతహలాడుతున్నాయి. నేడు మోస్తరుగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,090 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 ఎగిసి రూ.80,750 వద్ద ఉంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది. ట్రేడ్‌వార్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3000 టచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

News February 25, 2025

ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

image

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్‌ను ఆహ్వానించింది.

error: Content is protected !!