News February 25, 2025
అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లారు: పురందీశ్వరి

AP: ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. అందుకే నిన్న జగన్ సభకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ మరిచిపోవడం సరికాదని చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. వైసీపీ పాలనలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిందని దుయ్యబట్టారు.
Similar News
News November 15, 2025
ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెగా డీఎస్సీ 671వ ర్యాంకు సాధించిన రేఖ ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.
News November 15, 2025
గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందా?

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News November 15, 2025
సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>


