News February 25, 2025
జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News February 25, 2025
ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీలో రిక్లైనర్లు.. కారణమిదే!

కర్ణాటక అసెంబ్లీ లాబీలో MLAలు రెస్ట్ తీసుకునేందుకు రిక్లైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ఖాదర్ వెల్లడించారు. లంచ్ తర్వాత రెస్ట్ కోసం MLAలు సభకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి ఏర్పాటు వల్ల వారికి కాస్త విశ్రాంతి దొరికి ఫ్రెష్‌గా ఉంటారని, హాజరు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. MAR 3-21 వరకు సమావేశాలు జరగనుండగా, 15 రిక్లైనర్లను అద్దెకు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.
News February 25, 2025
అవి కేరళ చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్యలు: పోలీసులు

కేరళ తిరువనంతపురంలో యువకుడు అఫాన్(23) ఐదుగురు కుటుంబీకులను చంపిన <<15571171>>ఘటనలో<<>> దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బాబాయ్ లతీఫ్ తలపై 20సార్లు సుత్తితో బాదాడు. ప్రియురాలు ఫర్జానా, పిన్ని సుజాత, తల్లి, తమ్ముడిని ఇలాగే హతమార్చాడు. వారి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. 3ఇళ్లలో భయానక దృశ్యాలు కనిపించాయి. కేరళ చరిత్రలోనే ఈ హత్యలు అత్యంత క్రూరమైనవి’ అని పోలీసులు తెలిపారు.
News February 25, 2025
నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.