News February 25, 2025
జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.
Similar News
News February 25, 2025
నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News February 25, 2025
డయాబెటిస్ పేషెంట్స్ ఈ టిప్స్ ట్రై చేయండి

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని టిప్స్ సూచించారు.1.గ్లాస్ వేడి నీటిలో టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్‌ను వేసుకొని తాగండి. 2 చియా గింజలను నీటిలో నానబెట్టి తాగండి. 3. దోసకాయ ముక్కల్నినిమ్మరసంతో కలిపి తినండి 4.ఆకుకూరల సలాడ్ తీసుకోండి. 5. కొన్ని వాల్నట్స్, బాదం తినండి . 6 గ్లాసు నీటిలో దాల్చిన చెక్క నానబెట్టి తాగండి. వీటిని ఫాలో అయ్యి మీ డయాబెటిస్ కంట్రోల్ ఉంచుకోండి.
News February 25, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.