News February 25, 2025
మద్దతిచ్చినందుకు థాంక్యూ ట్రంప్: వివేక్ రామస్వామి

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.
Similar News
News February 25, 2025
ఏపీ అసెంబ్లీ వాయిదా

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
News February 25, 2025
జీమెయిల్ లాగిన్‌కు త్వరలో క్యూఆర్ కోడ్ విధానం?

జీమెయిల్ లాగిన్‌కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్‌లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్‌లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
News February 25, 2025
విద్యార్థులతో పనులు చేయించొద్దు: బాలల హక్కుల కమిషన్

AP: వసతి గృహాల్లో విద్యార్థులతో ఏ రకమైన <<15559875>>పనులు <<>>చేయించినా సిబ్బందిపై చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ అప్పారావు హెచ్చరించారు. విద్యార్థులతో వంట, పరిశుభ్రత పనులు, టాయిలెట్స్ క్లీనింగ్, నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.