News February 25, 2025
మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News February 25, 2025
HYDలో పెరిగిన హలీం ధరలు

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.
News February 25, 2025
HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
News February 25, 2025
నగరవాసులకు హైడ్రా హెచ్చరిక

ప్రజావాణిలో ఫిర్యాదు చేసేటప్పుడు భూ సమస్యలు, కోర్టులో పెండింగ్‌లో ఉంటే వాటి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలని హైడ్రా సూచించింది. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వ్యక్తిగత వివాదాలు పరిష్కరించబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అక్రమ కబ్జాలపై మాత్రమే ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపింది.