News February 25, 2025

నటిపై కేరళ కాంగ్రెస్ ఆరోపణలు.. రియాక్షన్ ఇదే

image

న్యూఇండియా కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారని కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను నటి ప్రీతి జింటా ఖండించారు. పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకొని తిరిగి చెల్లించినట్లు స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. తన SM అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయొద్దన్నారు. ఓ రాజకీయ పార్టీ ఇలాంటి ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసిందని చెప్పారు.

Similar News

News February 25, 2025

ఏపీ అసెంబ్లీ వాయిదా

image

ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించినట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ తర్వాత ఫిబ్రవరి 28కి సభను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

News February 25, 2025

జీమెయిల్ లాగిన్‌కు త్వరలో క్యూఆర్ కోడ్ విధానం?

image

జీమెయిల్ లాగిన్‌కు సంబంధించి SMS కోడ్ స్థానంలో క్యూఆర్ కోడ్‌లను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. మెయిల్ సెక్యూరిటీ కోసం ప్రస్తుతం SMS బేస్డ్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను గూగుల్ అమలు చేస్తోంది. దీనితో పోలిస్తే క్యూఆర్ కోడ్ విధానం మరింత భద్రతనిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ కోడ్‌లను స్కాన్ చేయడానికి స్మార్ట్ ఫోన్లలోని కెమెరా యాప్‌‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

News February 25, 2025

విద్యార్థులతో పనులు చేయించొద్దు: బాలల హక్కుల కమిషన్

image

AP: వసతి గృహాల్లో విద్యార్థులతో ఏ రకమైన <<15559875>>పనులు <<>>చేయించినా సిబ్బందిపై చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ అప్పారావు హెచ్చరించారు. విద్యార్థులతో వంట, పరిశుభ్రత పనులు, టాయిలెట్స్ క్లీనింగ్, నీళ్లు తెప్పిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి లేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!