News February 25, 2025
వరంగల్: 75 వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వరంగల్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్‌కి రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 25, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులతో విశాఖ కలెక్టర్ సమావేశం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం ప్రచార ప్రక్రియ గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థులు అనుసరించవలసిన విధానాలపై వారికి వివరించారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుపై పలు సూచనలు చేశారు.
News February 25, 2025
జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు: అనకాపల్లి ఎంపీ

జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కమిటీలో సభ్యుడైన సీఎం రమేశ్ సమావేశంలో పాల్గొని బిల్లుపై చర్చించారు. దేశంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు.
News February 25, 2025
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

TG: సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.