News February 25, 2025
NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

☞ఎవరికాలంలో నల్గొండ <<15559631>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..
Similar News
News February 25, 2025
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

TG: సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.
News February 25, 2025
హనుమకొండ: మహిళా డీగ్రీ కాలేజీలో సర్టిఫికేట్ కోర్సు

వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సృజనాత్మక రచన – పాట అనే అంశంపై సర్టిఫికేట్ కోర్సు ప్రారంభించారు.ఈ ప్రోగ్రాంలో ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ఫ్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డా.జి.సుహాసిని, తెలుగు విభాగాధిపతి మధు, IQAC కోఆర్డినేటర్ డా.సురేశ్ బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డా.అరుణ, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రత్నమాల, సునీత విద్యార్థులు పాల్గొన్నారు.
News February 25, 2025
పట్టాలెక్కనున్న రవితేజ ‘డబుల్ ధమాకా’?

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘ధమాకా’ 2022లో విడుదలై రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘డబుల్ ధమాకా’ తెరకెక్కనున్నట్లు సమాచారం. దర్శకుడు త్రినాథరావు ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని, మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి.