News February 25, 2025

మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Similar News

News February 25, 2025

గుర్రంపోడు తహశీల్దార్ సస్పెండ్

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగాను సెలవులో ఉన్న గుర్రంపోడు తహశీల్దార్ జి.కిరణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. గడువు దాటినా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేశారు.

News February 25, 2025

శ్రీసత్యసాయి జిల్లా TODAY TOP NEWS

image

➢ వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ
➢ అనంతపురంలో ఐదుగురికి జీవిత ఖైదు
➢ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
➢ లేపాక్షి మండలంలో యువకుడు ఆత్మహత్య
➢ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
➢ చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
➢ లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

News February 25, 2025

అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!