News February 25, 2025
35సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ చేసిందేంటి?: కేటీఆర్

TG: 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు విసుగు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? ఇవాళ మళ్లీ హస్తిన వెళ్లి చేసేదేంటని ప్రశ్నించారు. ‘గత 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. SLBCలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News February 25, 2025
విద్యార్థుల కోసం చివరి క్షణాల్లోనూ..!

ఉపాధ్యాయులకు విద్యార్థులే జీవితం. వారి భవిష్యత్తు కోసం చదువు చెప్తూ, ఒక్కోసారి దండిస్తూ తన జీవితాన్నే త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు చనిపోయే కొన్ని క్షణాల ముందు విద్యార్థుల కోసం ఆస్పత్రి బెడ్‌పై ల్యాప్‌టాప్ పట్టుకొని పనిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఉపాధ్యాయుడి కుమార్తె షేర్ చేయగా వైరలవుతోంది. విద్యార్థుల చదువు పట్ల అతని అంకితభావాన్ని అభినందించాల్సిందే.
News February 25, 2025
ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: ఈ నెల 27 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడంతో విద్యాసంస్థలు సిబ్బందికి సెలవు ఇవ్వడం లేదన్నారు. కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులతో సంబంధం లేకుండా పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని బండి విజ్ఞప్తి చేశారు.
News February 25, 2025
రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడుగుతా: అక్షర్

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ క్యాచ్ డ్రాప్ చేసి అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేశారు. దీంతో డిన్నర్‌కు <<15528906>>తీసుకెళ్తానంటూ<<>> హిట్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్‌పై ఆల్‌రౌండర్ స్పందించారు. ‘టీమ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అయ్యింది. పైగా కివీస్‌తో తర్వాతి మ్యాచ్‌కు ఆరు రోజుల సమయం ఉంది. రోహిత్‌ను డిన్నర్ పార్టీ అడగడానికి ఛాన్స్ వచ్చింది’ అని పేర్కొన్నారు.