News February 25, 2025

GOVT స్కూల్‌లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్

image

మహబూబాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం సందర్శించారు. క్లాస్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డైట్ మెనూ ప్రకారం పక్కాగా ఉండాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని తెలిపారు. అనంతరం క్లాస్ రూమ్‌లో పిల్లలతో మాట్లాడారు. వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 3, 2025

బాపట్ల పోలీస్ పీజీఆర్ఎస్‌కు 83 అర్జీలు: SP

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను SP ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 83 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు. సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరిస్తామన్నారు.

News November 3, 2025

ప్రజావాణిలో 89 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 89 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ప్రజల వినతులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

News November 3, 2025

తాండూరు: పత్తి కొనుగోలును ప్రారంభించిన కలెక్టర్

image

తాండూర్ మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 3 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తోందన్నారు.