News February 25, 2025

తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.

Similar News

News November 12, 2025

భీష్ముడిని, ధర్మరాజు ఏం అడిగాడంటే?

image

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
భావం: అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? దేనిని జపిస్తే జీవులు జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు? అని ధర్మరాజు, భీష్ముడిని అడిగారు. మోక్ష సాధన మార్గాన్ని, సర్వ శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గాన్ని తెలుసుకోవాలనే ధర్మరాజు జ్ఞాన జిజ్ఞాస ఈ ప్రశ్నలలో వ్యక్తమవుతోంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 12, 2025

గ్రామ పంచాయతీలకు శుభవార్త

image

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.

News November 12, 2025

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. దీన్నే ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ అంటారు. మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.