News February 25, 2025
వికారాబాద్: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 12,903 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News February 25, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

◼️భైంసా : ఏసీబీకి పట్టుబడిన భైంసా SI, కానిస్టేబుల్
◼️నిర్మల్ : కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలకు కోర్టు నోటీసులు
◼️భైంసాలో 108 వాహనాలు సీజ్
◼️సోన్ : కడ్తాల్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
◼️సోన్‌లో 80 వాహనాలకు జరిమానా
◼️నిర్మల్ : జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
News February 25, 2025
నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్‌ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.