News February 25, 2025
శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి

రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలం వచ్చే శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఫరూక్ ఆదేశించారు. మంగళవారం మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
Similar News
News February 25, 2025
SLBC టన్నెల్‌లో 10వేల క్యూబిక్ మీటర్ల బురద?

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో 15 అడుగుల ఎత్తులో10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజినీర్లు అంచనా వేశారు. దానిని బయటికి తీసేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ మరమ్మతు పనులు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముంటుందని సమాచారం.
News February 25, 2025
ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

✷ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ వెట్రిసెల్వి
✷ పట్టిసీమ తిరునాళ్ల పరిశీలించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
✷ జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
✷ కామవరపుకోటలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి
✷ఈవీఎం భద్రపరిచిన గదులను పరిశీలించిన కలెక్టర్
✷ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు
✷ మార్చి 8న మెగా లోక్ అదాలత్
✷ ముగిసిన అంగన్వాడీ జ్ఞాన జ్యోతి కార్యక్రమాలు.
News February 25, 2025
నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

◼️భైంసా : ఏసీబీకి పట్టుబడిన భైంసా SI, కానిస్టేబుల్
◼️నిర్మల్ : కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలకు కోర్టు నోటీసులు
◼️భైంసాలో 108 వాహనాలు సీజ్
◼️సోన్ : కడ్తాల్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
◼️సోన్‌లో 80 వాహనాలకు జరిమానా
◼️నిర్మల్ : జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్