News February 25, 2025
ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ముఖ్రా(కె) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి పర్యావరణ పరిరక్షణకు కొత్తబాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదికగా పోస్టు చేసి ఆమెను అభినందించారు.
Similar News
News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్‌లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
News February 25, 2025
నైట్ బ్రషింగ్ చేయకపోతే ప్రమాదమే: అధ్యయనం

రాత్రుళ్లు బ్రష్ చేయడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధుల (CVD) ప్రమాదాన్ని నైట్ బ్రషింగ్ తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. రాత్రిపూట బ్రషింగ్‌ను నిర్లక్ష్యం చేసిన వారితో పోలిస్తే, రోజుకు రెండు సార్లు పళ్లు తోముకునే వ్యక్తుల్లో CVDల సంభవం గణనీయంగా తగ్గినట్లు తేలింది. బ్రషింగ్ నిర్లక్ష్యం చేస్తే నోటి బ్యాక్టీరియా వృద్ధి చెంది గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
News February 25, 2025
KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!

శాసన మండలి ఎన్నికలకు కామారెడ్డి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కోసం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్లలో పట్ట భద్రుల ఓటర్లకు 29, ఉపాధ్యాయులకు 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించి సామాగ్రి కామారెడ్డిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులకు ఇప్పటికే రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు.