News February 25, 2025

స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులు జోడించి ప్రయత్నించాం: Dy.CM

image

ఏపీ ప్రజలకు ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులు అనే భావన వస్తుందని Dy.CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. 2021 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం చేసిన ప్రకటనకు YCP మద్ధతు పలికిందని అన్నారు. అప్పట్లో నాదేండ్లతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ నిర్ణయంపై పునరాలోచించాలని చేతులు జోడించి ప్రయత్నించామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్లాట్లు వేసి అమ్ముకోడానికి YCP నాయకులు చూశారని ఆరోపించారు.

Similar News

News February 26, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో DRM ఆకస్మిక తనిఖీ 

image

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్‌లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.

News February 26, 2025

పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్

image

సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌గా అంబదాస్ రాజేశ్వర్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. గతంలో ఆయన నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనల్ మొదటి అధికారిగా పనిచేశారు. ఇకనుంచి సంగారెడ్డి పౌర సరఫరాల మేనేజర్‌గా పూర్తి బాధ్యతలు వహించనున్నారు.

News February 26, 2025

చికెన్ లెగ్‌పీస్ తిన్న బాపట్ల జిల్లా కలెక్టర్

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా చికెన్ తినేందుకు ప్రజలు ఇప్పటికీ జంకుతున్నారు. చికెన్‌పై అపోహలు వద్దని చికెన్ తినొచ్చని అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో ఒకింత భయం నెలకొంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రజల భయం పోగొట్టేలా చికెన్‌తో తయారు చేసిన ఆహారం తింటూ కనిపించారు. దీంతో ఇకనైనా ప్రజలు భయాన్ని వీడి చికెన్ తినాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!