News February 25, 2025
సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
21 లక్షల నుంచి 1.3 కోట్లకు చేరిన HYD జనాభా..!

దేశంలో 2050 నాటికి నగర జనాభా 50 కోట్లకు చేరనుందని లెక్కలు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 1975లో హైదరాబాద్ జనాభా 21 లక్షలుండంగా.. ప్రస్తుతం 1.3 కోట్లకు చేరింది. హైదరాబాద్‌లో జనాభా వృద్ధి రేటు 6.2 రెట్లుందని పేర్కొన్నారు. మేధో మదన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా ప్రసంగించారు.
News January 7, 2026
కామారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

కామారెడ్డి జిల్లాలో MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం MRO నరేందర్ బాన్సువాడకు బదిలీ అయ్యారు. బాన్సువాడ MRO వరప్రసాద్ కలెక్టరేట్ సూపరిండెంట్‌గా, మహేందర్ పిట్లం MROగా నియమితులయ్యారు. నిజాంసాగర్ MRO భిక్షపతిని పెద్దకొడప్గల్‌కు బదిలీ చేయగా, ఇన్‌ఛార్జిగా ఉన్న అనిల్ కుమార్ ఎల్లారెడ్డి RDO కార్యాలయానికి వెళ్లారు. సవాయి సింగ్‌ను బీర్కూర్‌కు, భుజంగరావు నిజాంసాగర్‌కు బదిలీ అయ్యారు.
News January 7, 2026
ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.


