News February 25, 2025

ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో భారత్ టాప్

image

2024లో ప్రపంచవ్యాప్తంగా 54 ప్రజాస్వామ్య దేశాల్లో 296 సార్లు ఇంటర్‌నెట్‌ను నిలిపివేసినట్లు Access Now సంస్థ వెల్లడించింది. 84సార్లు షట్‌డౌన్‌తో భారత్ వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. మణిపుర్‌లో 21, హరియాణాలో 12, J&Kలో 12 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. పాక్‌ 21, రష్యా 19, ఉక్రెయిన్ 7సార్లు నెట్ నిలిపేశాయి. మయన్మార్‌లో 85సార్లు ఆపేసినా అది మిలిటరీ ప్రభుత్వం కావడంతో జాబితాలో చేర్చలేదు.

Similar News

News February 26, 2025

TODAY HEADLINES

image

☛ నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: సీఎం చంద్రబాబు
☛ 15 ఏళ్లు కూటమిదే అధికారం: Dy.CM పవన్ కళ్యాణ్
☛ TGలో మార్చి 1న కొత్త రేషన్ కార్డులు
☛ TGSRTCలోకి త్వరలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం రేవంత్
☛ TG EAPCET ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ వాయిదా
☛ 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు: CBSE
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: AUS vs SA మ్యాచ్ రద్దు

News February 26, 2025

వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవం(PHOTOS)

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.

News February 26, 2025

నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

image

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.

error: Content is protected !!