News February 25, 2025
గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత

ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామం నుంచి రిజర్వు ఫారెస్ట్‌లో గల గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు తహశీల్దార్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దారి తప్పిన ఏనుగుల గుంపు ప్రమాదం కలుగజేస్తాయని ముందు జాగ్రత్తగా ఉత్సవాలను నిలిపివేసినట్లు తెలిపారు.
Similar News
News September 18, 2025
పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.
News September 18, 2025
APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.
News September 18, 2025
కాగజ్‌నగర్: కోనప్పను కలిసిన మిషన్ భగీరథ వర్కర్స్

కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను మిషన్ భగీరథ సూపర్వైజర్, వాల్ ఆపరేటర్, హెల్పర్లు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ కోనప్పకు వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆయన మిషన్ భగీరథ వర్కర్ల సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు.