News February 25, 2025

ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య

image

AP: రాష్ట్ర ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత ఎండీ దినేశ్ కుమార్‌ అవినీతికి పాల్పడ్డారని <<15567607>>జీవీ రెడ్డి<<>>(ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్) ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న తన పదవికి ఆయన రాజీనామా చేయగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఆ తర్వాత దినేశ్‌ను జీఏడీకి అటాచ్ చేసింది. ఇవాళ కొత్త ఎండీని నియమించింది.

Similar News

News February 26, 2025

నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

image

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.

News February 26, 2025

భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 206 ఉద్యోగాలకు <>నోటిఫికేషన్<<>> వెలువడింది. ఇందులో జూ.అసిస్టెంట్(ఫైర్), సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్, ఎలక్ట్రానిక్స్, ఆపరేషన్స్) జాబ్స్ ఉన్నాయి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూ.అసిస్టెంట్‌కు ₹31K-92K, సీనియర్ అసిస్టెంట్‌కు ₹36K-1.10L జీతం ఉంటుంది. MAR 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/

News February 25, 2025

ప్రశాంత్ ‘బ్రహ్మరాక్షస్’ మూవీలో ప్రభాస్?

image

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ టాక్. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస్’ మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని డార్లింగ్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!