News February 25, 2025
శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్‌ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News February 26, 2025
వికారాబాద్: ఇంటర్ పరీక్షలు రాయనున్న 16,439మంది స్టూడెంట్స్

మార్చ్ 5 నుంచి కొనసాగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు 29 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16,439 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం- 7,914 మంది, సెకెండ్ ఇయర్ 6,963 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.
News February 26, 2025
మహా శివరాత్రికి ఆ పేరెలా వచ్చింది?

ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కంటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటికి వచ్చే విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో నింపుకొని ముల్లోకాలను కాపాడుతాడు. ఇలా చేసిన ఆ కాళరాత్రే శివరాత్రి అని ప్రతీతి.
News February 26, 2025
దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్

దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పుల పాలు కావడంతో మంగళవారం పుర్క జగన్ తన నివాసంలో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు SI నమోదు చేశారు.