News February 25, 2025

ఇటిక్యాల: పనుల పురోగతిపై పరిశీలన

image

ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఉపాధి హామీ పనులు, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తదితర పనులు పరిశీలించారు. అధికారులకు సంబంధిత పనుల పురోగతి గురించి ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

‘రిచా’ పేరిట స్టేడియం

image

WWC విన్నర్ రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

భద్రాద్రి రామయ్యతో అందెశ్రీకి ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. కొత్తగూడెంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలోత్సవ్‌‌కు పలుమార్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం, పాడిన పాటలను స్మరించుకున్నారు. కొత్తగూడెం, భద్రాచలం పరిసరాల్లో ఏప్రాంతానికి వచ్చిన గోదావరిలో స్నానం చేసి రామయ్యను దర్శనం చేసుకునేవారని గుర్తు చేసున్నారు.

News November 11, 2025

అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం

image

ప్రముఖ రచయిత అందెశ్రీ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే అందెశ్రీకి మన ఖమ్మంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన నెలనెల వెన్నెల 65వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాయమైపోతున్న మనిషి విలువల గురించి చేసిన ప్రసంగం, పాడిన పాటను పలువురు నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతికి నెలనెల వెన్నెల నిర్వాహకులు సంతాపం తెలిపారు. అందెశ్రీ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామన్నారు.