News February 25, 2025
ఇంటర్ పరీక్షలుసజావుగా నిర్వహించాలి- కలెక్టర్

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అధికారులకు సూచించారు. మంగళవారం అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 1 నుంచి నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News February 26, 2025
మండలానికి ఒక గ్రామంలో ప్రకృతి వ్యవసాయం: కలెక్టర్

ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రకృతి వ్యవసాయం లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయానికి వనరులు గల గ్రామాలను ముందుగా గుర్తించాలన్నారు. దీనికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
News February 26, 2025
శ్రీకాకుళం వరకే విశాఖ -పలాస పాసింజర్

విశాఖ-పలాస రైల్వే లైన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా విశాఖ-పలాస పాసింజర్ (67289/90)శ్రీకాకుళం వరకు మాత్రమే నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. మార్చ్ 2 నుంచి మార్చ్ 8వరకు ఈ రైళ్ళు శ్రీకాకుళం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పలాసకు బదులుగా శ్రీకాకుళం నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 26, 2025
కురవి జాతర ఏర్పాట్లపై సమీక్ష

ఎస్పీ రామ్‌నాథ్ ఆదేశాలతో కురవి జాతర ఏర్పాట్లపై తొర్రూరు డీఎస్పీ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇతర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై తొర్రూరు డీఎస్పీ పలు సూచనలు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.