News February 25, 2025
Gold Rates: రికార్డు బ్రేక్ దిశగా పరుగులు..

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరేందుకు తహతహలాడుతున్నాయి. నేడు మోస్తరుగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,090 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 ఎగిసి రూ.80,750 వద్ద ఉంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది. ట్రేడ్‌వార్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3000 టచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
Similar News
News February 26, 2025
TODAY HEADLINES

☛ నిరుద్యోగులకు త్వరలోనే రూ.3000: సీఎం చంద్రబాబు
☛ 15 ఏళ్లు కూటమిదే అధికారం: Dy.CM పవన్ కళ్యాణ్
☛ TGలో మార్చి 1న కొత్త రేషన్ కార్డులు
☛ TGSRTCలోకి త్వరలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం రేవంత్
☛ TG EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా
☛ 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు: CBSE
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: AUS vs SA మ్యాచ్ రద్దు
News February 26, 2025
వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవం(PHOTOS)

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.
News February 26, 2025
నాలుగు కాళ్లతో 17 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసిన AIIMS వైద్యులు

ఢిల్లీ AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. నాలుగు కాళ్లతో జన్మించి 17 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న UPకి చెందిన బాలుడికి కొత్త జీవితం ఇచ్చారు. పొట్టపై ఉన్న రెండు కాళ్లను విజయవంతంగా తొలగించారు. తల్లి కడుపులో కవలలు సంపూర్ణంగా ఎదగకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని డాక్టర్లు తెలిపారు. కోటి మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా 42 కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు.