News February 25, 2025
ఘన్‌పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 26, 2025
మహా శివరాత్రికి ఆ పేరెలా వచ్చింది?

ఈ సృష్టికి లయకారకుడైన పరమశివుడు లింగంగా ఆవిర్భవించిన రోజే మహా శివరాత్రి. మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున ఆ ముక్కంటి శివలింగంగా ఆవిర్భవిస్తాడు. అయితే పురాణాల ప్రకారం శివరాత్రికి మరో కారణం కూడా ఉంది. క్షీరసాగర మథనం సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ బయటికి వచ్చే విషాన్ని పరమేశ్వరుడు తన గరళంలో నింపుకొని ముల్లోకాలను కాపాడుతాడు. ఇలా చేసిన ఆ కాళరాత్రే శివరాత్రి అని ప్రతీతి.
News February 26, 2025
దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్

దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పుల పాలు కావడంతో మంగళవారం పుర్క జగన్ తన నివాసంలో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు SI నమోదు చేశారు.
News February 26, 2025
హనుమకొండ: వేయి స్తంభాల ఆలయంలో పోలీసుల పటిష్ఠ బందోబస్తు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేయి స్తంభాల దేవాలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ డివిజన్ పోలీసులు భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ బందోబస్త్ ఏర్పాటుకు సంబంధించి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.